ఉద్యోగాలకు దరఖాస్తులు..

– జూన్ 7 లోగా దరఖాస్తులు పంపాలి
– సీల్ కవర్ల ద్వారా మాత్రమే పంపించాలి
– నేరుగా ఇచ్చే దరఖాస్తులు స్వీకరించబడవు 
– జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : నల్గొండ జిల్లా ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టులోని కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకుగాను 2 సంవత్సరాలు కాంట్రాక్టు పద్ధతి పై సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -3, టైపిస్టు, డ్రైవర్, ఆఫీస్ సబార్డినెట్  పోస్టులలో పనిచేసేందుకు అర్హులైన విశ్రాంతి పొందిన జుడీషియల్ ఉద్యోగులు, అలాగే ఇతర అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జూన్ 7 సాయంత్రం 5 గంటలలోగా పూర్తి చేసిన దరఖాస్తులను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నల్గొండ పేరు మీదుగా సీల్డ్ కవర్లో లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చని తెలిపారు. సీనియర్ అసిస్టెంట్ -1,సెనోగ్రాఫర్ గ్రేడ్- 3 ఒక పోస్టు, టైపిస్టు -2 పోస్టులు, డ్రైవర్-1 పోస్టు, ఆఫీస్ సబార్డినేట్-3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్   జడ్జ్ తెలిపారు.అభ్యర్థులు దరఖాస్తులను సీల్ కవర్ల ద్వారా మాత్రమే పంపించాలని, నేరుగా ఇచ్చే దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేశారు. తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టేరియల్ సర్వెంట్లుగా పనిచేసి విశ్రాంతి పొందిన వారైతే జూలై 1, 2024 నాటికి 65 సంవత్సరాలు లోపే ఉండాలని, తెలంగాణ  జ్యూడిషియల్ మినిస్టీరియల్ సర్వీస్ లో పనిచేసిన వారు మాత్రమే  అర్హులుగా ఉంటారని తెలిపారు. విశ్రాంతి పొందిన తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టేరియల్ స్టాప్ అందుబాటులో లేని  పక్షంలో ఇతర అభ్యర్థులను ఈ పోస్టులకు తీసుకోవడం జరుగుతుందని, వారికి జూలై 1, 2024 నాటికి 18 నుండి 34 సంవత్సరాలు లోపు  వయసు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ,ఈ డబ్ల్యు ఎస్ వారికి 5 సంవత్సరాల వయసు మినహాయింపు ఉంటుందని, దివ్యాంగులకు 10 సంవత్సరాల  వయసు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు  ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉండాలని, కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వారికి  ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, స్టేనోగ్రాఫర్ గ్రేడ్- 3 పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉండి తెలంగాణ ప్రభుత్వం ద్వారా టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలని,  పేర్కొన్నారు. టైపిస్టు పోస్టుకు బ్యాచులర్స్ డిగ్రీ తోపాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్వహించిన ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఉత్తీర్ణత లేదా తత్సవాన అర్హత కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవర్ పోస్ట్ కు ఎస్ ఎస్ సి ఉత్తీర్ణులై తెలుగు, ఉర్దూ, హిందీ లేదా ఇంగ్లీష్ లలో రాయడం లేదా చదవడం వచ్చి ఉండాలని, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆఫీస్ సబార్డినెట్  పోస్టుకు  7 నుండి 10 వ తరగతి పాస్ అయి ఉండాలని, పదవ తరగతి కన్నా ఎక్కువ ఉన్నవారిని ఈ పోస్టులకు అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. పైన పేర్కొన్న పోస్టులకు టైపు రైటింగ్ షార్ట్ హ్యాండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్- 3 కి అలాగే టైప్ పోస్టులకు పరీక్ష ఉంటుందని, డ్రైవర్ పోస్ట్ కు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందని వెల్లడించారు.  అభ్యర్థులు దరఖాస్తు తో పాటు, వారి విద్యార్థులకు సంబంధించిన ధ్రువీకరించిన కాపీలను, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్, కులం, దృవపత్రము, ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, లోకల్ నాన్ లోకల్ సర్టిఫికెట్, సొంత చిరునామా కలిగిన రిజిస్టర్ పోస్టు చేసేలా 30 రూపాయల స్టాంపులు అతికించిన కవర్ ను జత చేసి జూన్ 7 సాయంత్రం 5 గంటలలోగా పంపించాలని జూన్ 7 తర్వాత వచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితులలో అనుమతించడం జరిగిందని స్పష్టం చేశారు.
Spread the love