
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 58 అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించాలన్నారు. రెవిన్యూ శాఖ 34, జిల్లా పంచాయతీ శాఖ 11, మున్సిపాలిటీ 3, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 2, సివిల్ సప్లైస్ 2,దేవాదాయ శాఖ 2, జిల్లా కో ఆపరేట్ , ఆర్ అండ్ బి , జిల్లా సంక్షేమ , లేబర్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలిపారు. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్టేట్ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి పరిష్కరించాలన్నారు. వివిధ శాఖలలో పెండింగ్ ఉన్న సంక్షేమ అభివృద్ధి పనుల పై సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.