నవ తెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన గుండు రాజు గౌడ్ ను యువజన కాంగ్రెస్ చౌటుప్పల్ మండల ఉపాధ్యక్షులుగా నియమిస్తూ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాధగోని శేఖర్ గౌడ్ బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. నా నియమాకానికి సహకరించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోయ దేవేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.