మేడారం జాతర ట్రస్ట్ బోర్డు నియామకం

– మేడారం జాతర అధ్యక్షులుగా అర్రెం లచ్చు పటేల్
నవతెలంగాణ – తాడ్వాయి 
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగే గిరిజనుల ఆరాధ్యదైవం సమ్మక్క, సారలమ్మ జాతరకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో (ఫిబ్రవరి) జరిగే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మేడారం జాతర ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబర్లను నియమించింది. 14మందితో కూడిన కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మేడారం ట్రస్ట్ బోర్డ్ ఉత్సవ కమిటీ చైర్మెన్ గా అర్రెం లచ్చు పటేల్, సభ్యులుగా మిల్కూరి ఐలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజరత్నం, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణ సింగ్, ముంజాల బిక్షపతి గౌడ్, సుంచ హైమావతి, చామర్తి కిషోర్, కోరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం కృష్ణస్వామి, ఎక్సాఫిషియో మెంబర్ గా సిద్దబోయిన జగ్గారావు లను నియమించింది.ఈ నెల ఫిబ్రవరి గురువారం‌ 15వ తారీకు రోజున  దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, స్థానిక మంత్రి డాక్టర్ సీతక్క ల సమక్షంలో ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Spread the love