
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చుక్కాపూర్ లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీని శుక్రవారం నియమించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చేతుల మీదుగా నియామకపుత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా శనిగరం కమలాకర్ రెడ్డి, కమిటీ సభ్యులుగా బండారి యాదగిరి రెడ్డి, గట్టగోని రామ గౌడ్, కొత్త కాపు రాజారెడ్డి, పాత లక్ష్మీరాజ్యం, ఎర్రబోయిన దేవయ్య, కందాడి బాల్ రెడ్డి, కర్రోల్లశంకర్ గౌడ్, ఐలేని వెంకట రాజేశ్వర్ రావు, నల్ల అంజయ్య, చింత రాకేష్ కుమార్, చింతల నర్సింలు తదితరులు నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకతో షబ్బీర్ అలీ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.