ఇటీవల పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా వచ్చిన యాదవ్ రావు సార్ సేవలు అభినందనీయమని అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మీబాయి అన్నారు. మద్నూర్ మండలంలోని అంతాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వారం పది రోజుల క్రితం కొత్తగా వచ్చిన యాదవ రావు సార్ పాఠశాలలో చదువుకుని విద్యార్థిని విద్యార్థులందరికీ నోట్ బుక్కులు స్వచ్ఛందంగా అందజేయడం ఆయన విద్యా బోధనతో పాటు స్వచ్ఛంద సేవలో పాల్గొంటూ.. గ్రామస్తుల్లో విద్యార్థిని విద్యార్థుల్లో మంచి పంతులుగా పేరు పొందారని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులకు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మీబాయి చేతులు మీదుగా విద్యార్థులకు నోటుబుక్కులను పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు ఎన్ అభిలాష్ ఇక్కడి నుండి బదిలీపై వెళ్తున్న రాజేందర్ ప్రసాద్ సార్ గ్రామ పెద్దలు యువకులు బాలు దత్తు అఖిల్ మారుతి తదితరులు పాల్గొన్నారు.