పనితనానికి ప్రశంస…

– విద్యుత్ సిబ్బందికి అవార్డులు పంట…
– పెద్దవాగు విపత్తులో మెరుగైన సేవలకు గుర్తింపు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజల సౌకర్యం కోసం పనిచేసే ఎవరికైనా ప్రశంసలు లభిస్తాయి.వారి పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్  విభాగంలో అశ్వారావుపేట సబ్ డివిజన్ లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ గుర్తింపు కలిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పరిపాలనలో పనితనం కనబరిచిన ఉద్యోగులకు ప్రతీ ఏడాది ప్రశంసా పత్రాలు, బెస్ట్ అవార్డులు ప్రభుత్వం ప్రకటిస్తుంది. అందులో భాగంగా గత నెల అధిక వర్షాలకు భారీ వరద చేరి విపత్తు దారితీసిన పెద్దవాగు వరద ముంపు గ్రామాల్లో తక్షణమే గృహ విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో పాటు ధ్వంసం అయిన విద్యుత్ వ్యవస్తను ను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఈ పనితనాన్ని గుర్తించిన వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏడీఈ వెంకటేశ్వర్లు, వినాయక పురం ఏఈ సంతోష్,లైన్ ఇన్స్పెక్టర్ రామక్రిష్ణ లకు ఉత్తమ పనితనం అవార్డ్ ను గురువారం అందజేసారు. ఎన్పీడీసీఎల్ సీఎం డీ కర్నాటి వరుణ్ రెడ్డి ఏడీఈ వెంకటేశ్వర్లు కు ఉత్తమ ఇంజనీర్ అవార్డ్ అందజేసారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని డీఈ నందయ్య తో పాటు 28 మందికి ఉత్తమ పనితనం అవార్డ్లును ఎస్సీ బీకాం సింగ్ చేతులు మీదుగా అందజేసారు.

Spread the love