నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యనభ్యసుస్తున్న పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభ పరిక్షలను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవార నాడు నిర్వహించారు. ఈ సంధర్భంగా స్థానిక ఎస్సై సత్యనారాయణ ముఖ్యఅథితిగా పాల్గోని ప్రశ్నపత్రాలను విడుదల చేసారని హెచ్ఎం హన్మంత్ రెడ్డి తెలిపారు. పది తరగతి విద్యార్థుల ప్రతిభ వెలికి తీయడావికి ఎస్ఎఫ్ఐ ప్రయత్నం కృషి వెలకట్టలేనిదని వారిని ఆభినందించడం జర్గిందని హెచ్ఎం హన్మంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులలో భయాన్ని పోగోట్టి పరిక్షలు సజావుగా రాసేందుకు ప్రతిభ పరిక్ష నిర్వహించడం జర్గిందని ఎసిఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ అన్నారు. కార్యక్రమంలో ఎస్సై సత్యనారాయణ, హెచ్ఎం హన్మంత్ రెడ్డి , ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్, మండల శాఖ అధ్యక్షుడు షేక్ ఫిర్దోస్, విలాస్ కళ్యాణ్ తదితరులు పాల్గోన్నారు.