ఎన్నికల  నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్,అర్.వి.కర్ణన్
నవతెలంగాణ-నకిరేకల్ : నేడు జరుగనున్న శాసన సభ సాధారణ ఎన్నికల కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అర్.వి. కర్ణన్ తెలిపారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అర్.వి.కర్ణన్ నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన  డిస్ట్రిబ్యూషన్ ఆండ్ రిసెప్షన్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 30 న జరుగనున్న పోలింగ్ కు డిస్ట్రిబ్యూషన్ ఆండ్ రిసెప్షన్ సెంటర్ లలో ఈ.వి.యం.లు , పోలింగ్ మెటీరియల్ పంపిణీ నిర్వహిస్తున్నట్లు, పోలీస్, సెక్టార్ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సాధారణ ఎన్నికల నిర్వహణ పై తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలపై  సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి , ఓటర్ లు తమ ఓటు హక్కు స్వేచ్చగా వినియోగించు కునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.పంపిణీ కేంద్రాల ద్వారా ఎన్నికల సామాగ్రి చేయడం జరుగుతుందని ఎన్నికల విధులలో పాల్గొని సిబ్బంది అధికారులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలు లో ఉన్నట్లు,5 గురి కి మించి గుమి కూడ వద్దని తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతిక్షణం అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సాధారణ పరిశీలకులు కె.బాల సుబ్రహ్మణ్యం, పోలీస్ పరిశీలకులు విజయ్ సింగ్ మీనా, ఎస్.పి.అపూర్వ రావు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు ఉన్నారు,
Spread the love