గ్రూప్ వన్ ఫిలిం పరీక్షకు  ఏర్పాట్లు పూర్తి..

– జూన్ 9న ఉదయం 10:30 నుండి 1:00 వరకు పరీక్ష
– 47 పరీక్ష కేంద్రాలు.. 16 899 మంది అభ్యర్థులు 
– పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ఈ నెల  9న నిర్వహించనున్న గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.  ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.నల్గొండ జిల్లాలో మొత్తం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్ష  కేంద్రాలలో 16899 మంది అభ్యర్థులు గ్రూప్-1  ప్రిలిమినరీ పరీక్షను రాయనున్నారు.  పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా అధికారులు   అన్ని చర్యలు తీసుకోన్నారు.  పరీక్షలు నిర్వహించే రోజున అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో 144  వ సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు 3 కిలో మీటర్ల పరిధిలో  జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు.   పోలీస్ ల  ద్వారా అవసరమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 47 పరీక్ష కేంద్రాలలో బందోబస్తు తోపాటు, పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు వెళ్లే ముందు  తనిఖీచేయడం, అలాగే మహిళా అభ్యర్థుల తనిఖీకి మహిళా పోలీసులను సైతం నియమించారు.  అనుమతించిన వారు తప్ప పరీక్ష కేంద్రాలలో ఇతరులు ఎవరు వెళ్లడానికి వీలులేదు. ప్రతి రూటుకి తప్పనిసరిగా భద్రత ఏర్పాటు  చేశారు.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సేవలు ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీ ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ ద్వారా అవసరమైనన్ని బస్సులను నడపనున్నారు. అంతేకాక అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రీక్వెన్సీ సైతం పెంచనున్నారు.  విద్యుత్ అంతరాయం లేకుండా పరీక్ష కేంద్రాలలో నిరంతర  విద్యుత్ సరఫరాకు  చర్యలు తీసుకున్నారు.
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు..
– అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 10 తర్వాత వస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదని అధికారులు  స్పష్టం చేస్తున్నారు.
– పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవు.
–  పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే మొబైల్ ఫోన్ అనుమతి ఉంటుంది.
– ఇంకా హాల్ టికెట్లు రాని అభ్యర్థులు హాల్ టికెట్లను  www.tspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
– పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్ లు, బ్లూటూత్ డివైస్లు, వాచ్ లు, మ్యాథమెటికల్ టేబుల్స్, లాక్ బుక్కులు, లాగ్ టేబుల్స్ తీసుకురాకూడదు.
–  వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్ లు, ఫోచస్, రైటింగ్ ప్యాడ్, నోట్ చార్ట్స్, లూజ్ సీట్లు, అలాగే బంగారు ఆభరణాలు, ఇతర గాడ్జట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, రికార్డింగ్ వస్తువులు తీసుకు వచ్చేందుకు అనుమతి లేదు.
–  అభ్యర్థులు బూట్లు కాకుండా చెప్పులు మాత్రమే వేసుకోని రావాలి.
– పరీక్ష పూర్తయ్యేంతవరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళకూడదు.
– పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఓఎంఆర్ ఆన్సర్ సీట్లను అప్పగించి వెళ్ళాల్సి ఉంటుంది.
–  పరీక్ష కేంద్రంలో ఉదయం 9:30 గంటల నుండి అభ్యర్థుల బయోమెట్రిక్ ప్రారంభమవుతుంది. అందువల్ల తప్పనిసరిగా బయోమెట్రిక్ ఇవ్వాలి.
–  అలాగే ఎగ్జామినేషన్ తర్వాత తిరిగి వెళ్లే ముందు  సైతం   తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది.
–  బయోమెట్రిక్ వేయని, ఓఎంఆర్ ఆన్సర్ సీటును  అప్పగించని  అభ్యర్థుల ఓఎంఆర్ ల ఆన్సర్ మూల్యాంకనం చేయడం జరగదు.
– అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు మెహేంది ధరించవద్దు.
– తాత్కాలిక టాటూస్, అభ్యంతరకరమైన మెటీరియల్ ను ధరించడం వంటివి చేయకూడదు.
– ప్రతి అర్ధగంటకు ఒకసారి అభ్యర్థుల సౌకర్యార్థం బెల్ ను మోగించడం జరుగుతుంది.
– అవసరమైతే  ఇన్విజిలేటర్ ద్వారా సైతం అభ్యర్థులు సమయాన్ని తెలుసుకోవచ్చు.
– అభ్యర్థులు ఒకరోజు ముందుగానే  పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తే  ఉపయోగకరంగా ఉంటుంది.
– హాల్ టికెట్లు పై సూచనలు అన్నిటిని ప్రతి అభ్యర్థి తప్పకుండా చదువుకోవాలి.
Spread the love