
మండలంలోని బట్టుగూడెం గ్రామానికి చెందిన గూడెం గ్రామంలోమంగళవారం గాలి లింగారెడ్డి అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి భక్తి పాటలు భజన కార్యక్రమాలతో సందడి చేశారు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తుల నడుమ స్వామి వారి పూజా కార్యక్రమం ఘనంగా ముగిసిన అనంతరం స్వామివారి అన్నప్రసాద ఏర్పాటు చేశారు. పలువురు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాములు బంధువులు పాల్గొన్నారు.