అబద్ధాలతో అరవింద్‌ బతుకున్నారు

– టీపీసీసీ మీడియా కమిటీ చైర్మెన్‌ సామ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అర్వింద్‌ అబద్ధాలతో బతుకున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మెన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో బీజేపీ దేశ వ్యాప్తంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నదని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.మొన్న సీఎం రేవంత్‌ కాన్వారు కింద పడి ఓ యువకుడు చనిపోయారని ప్రచారం చేశారనీ, నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై ఫేక్‌ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.లేని ప్రచారాలు చేస్తే ఆయన్ను చెప్పులతో కొట్టించుకునే పరిస్థితి వస్తోందని హెచ్చరించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు జీవి వినోద్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సోషల్‌ మీడియా వారియర్స్‌ను బెెదిరించడం సరైందికాదన్నారు. చట్టబద్ధంగా విచారణ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌ రాకుండా ఆపగలదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ ఇన్‌ఛార్జి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ బీజేపీ అనాలోచితంగా ముందుకు పోతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల ద్వారా అనైతిక చర్యలకు పాల్పడుతోందన్నారు.

Spread the love