జలమండలి ఎండీగా అశోక్‌ రెడ్డి బాధ్యతల స్వీకరణ

– ఘన స్వాగతం పలికిన అధికారులు, ఉద్యోగులు
– 2009-11 మధ్య ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జలమండలి నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అశోక్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10.15 గంటల సమ యంలో ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనకు జలమండలి ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. పుష్ఫగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌లో ఇప్పటిదాకా ఎండీగా పని చేసిన సుదర్శన్‌ రెడ్డి నుంచి ఆయన ఛార్జ్‌ తీసుకున్నారు.
గతంలోనూ జలమండలితో అనుబంధం
అశోక్‌ రెడ్డికి ఇప్పటికే జలమండలితో అనుబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన రెండేళ్లపాటు జల మండలిలో పనిచేశారు. 2009 నుంచి 2011 మధ్య కాలంలో ఆయన జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ), ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా సేవలు అందించారు. తర్వాత 2012 నుంచి 2014 వరకు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. 2019లో 9 నెలల పాటు మూసీ రివర్‌ డెవల ప్‌మెంట్‌ అథారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ పని చేసిన అనుభవముంది. ఇప్పటి దాకా ఎండీగా పని చేసిన సుదర్శన్‌ రెడ్డి సాధారణ పరిపాలన శాఖకు బదిలీపై వెళ్లారు. ఆయన గతేడాది డిసెంబరు 18న జలమండలి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 7 నెలలపాటు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

Spread the love