– పెద్దవాగు కాలువ లో చిక్కుకున్న నారాయణపురం రైతులు,కూలీలు…
– హెలీకేప్టర్ సహాయంతో రక్షించేందుకు ప్రయత్నాలు….
– పెద్దవాగు ప్రాజెక్ట్ కు సామర్ధ్యం మించి వరద…
– గేట్లు అన్నీ ఎత్తివేత…
– కట్టకు పొంచి ఉన్న ప్రమాదం…
– పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే జారే..
నవతెలంగాణ – అశ్వారావుపేట
గత రెండు రోజులు గా కొండ కు చిల్లు పడ్డ రీతిలో ఎడతెరిపిలేని కుండపోత వానలు కురవడంతో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో గురువారం ఉదయం 8.30 నుండి సాయంత్రం వరకు జిల్లా లోనే అశ్వారావుపేట లో 109.3 అత్యధిక వర్షపాతం నమోదు అయింది. దీంతో మండలం లోని పెద్దవాగు ప్రాజెక్ట్ సామర్ధ్యం మించి వరద చేరడంతో ఉన్న మూడు గేట్లు ఎత్తారు.అయినా కుట్టు పై నుండి వరద ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ సామర్ధ్యం 40 వేల క్యూసెక్కు దుకు గానూ 60 వేల క్యూసెక్కుల నీరు చేరింది. నారాయణపురం – బచ్చువారిగూడెం మధ్యలో గల పెద్దవాగు భారీగా వరద నీరు చేరడంతో పొలాలు కు వెళ్ళిన రైతులు,కూలీలు,పలు వాహనాలు ఆ వరదలో చిక్కుకున్నాయి. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రభుత్వాన్ని సంప్రదించి హెలీక్యాప్టర్ సహాయంతో వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేపట్టారు. తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,సీఐ కరుణాకర్,ఐబీ ఈ ఈ సురేష్ లు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట పట్టణంలో సైతం లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.ఎడతెరిపిలేని వర్షంతో జనజీవనం స్తంభించింది.