నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
క్రీడాకారులు మంచి ప్రతిభ కనబర్చి జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని రైల్వే బోర్డు సలహా మండలి సభ్యుడు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉష్కం రఘుపతి అన్నారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ 17 క్రికెట్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను స్థానిక ఇందిరా ప్రిదయర్శిని స్టేడియంలో నిర్వహించారు. దీనికి ఆయనముఖ్య అథితిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకోని క్రికెట్ ఆడి ప్రారంభించారు. ఆదిలాబాద్ నుంచి హిమతేజ రంజి ట్రోఫిలో రాణిస్తున్నారని ఉష్కం రఘుపతి తెలిపారు. జిల్లాలో క్రీడాకారులకు కొదవ లేదని, తమ ప్రతిభతో జాతీయ స్థాయి వరకు రాణిస్తు జిల్లాకు పేరు తెవాలన్నారు. క్రీడాకారులకు అవసరమైన సహకారం అందించడానికి తను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన క్రీడాల అభివృద్ధి అధికారి పార్థసారథి, ఎస్జిఎఫ్ కార్యదర్శి కాంతారావ్, పేట సంఘం నాయకులు ఎన్.స్వామి, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ పాల్గొన్నారు.