Tuesday, June 16, 2026
E-PAPER
Homeజాతీయంసీజేపీ వ్యవస్థాపకుడిపై దాడి

సీజేపీ వ్యవస్థాపకుడిపై దాడి

- Advertisement -

అభిజిత్ దీప్కే చెంపపై కొట్టిన దుండగులు
జైపూర్ లో ఆందోళన చేస్తుండగా దౌర్జన్యం
దాడి చేసిన వారిని చితకబాదిన
కాక్రోచ్‌ పార్టీకార్యకర్తలు

జైపూర్ : రాజస్తాన్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. నీట్‌తో సహా వివిధ జాతీయ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జైపూర్ లో సీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని చెంపపై కొట్టారు. అభిజీత్‌ను కొట్టిన వ్యక్తులపై సీజేపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు.

ఏం జరిగింది..?
కాక్రోచ్ జనతా పార్టీ జైపూర్ లో నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగం మొదలైన సమస్యలపై నిరసన తెలపడానికి పిలుపునిచ్చింది. సోమవారం షహీద్ స్మారకం వద్దకు భారీ సంఖ్యలో యువతీయువకులు తరలివచ్చారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు అభిజీత్ దీప్కేపై దాడికి పాల్పడ్డారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం, దీప్కే నిరనస జరుగుతున్న స్థలానికి చేరుకోగానే, మద్దతుదారులు ఆయనను తమ భుజాలపైకి ఎత్తుకున్నారు. అదే సమయంలో గుంపులో ఉన్న కొందరు యువకులు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకొచ్చి చెంపదెబ్బలు కొట్టారు. దీనితో దీప్కే మద్దతుదారులు సదరు నిందితులను పట్టుకొని, వారిపై ఎదురుదాడి చేశారు. దీనితో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత నిరసనకారులు అవినీతికి, పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ఈ సమస్యలపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే శాంతంగా ఉండాలని దీప్కే కార్యకర్తలకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -