Tuesday, June 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబొగ్గు బ్లాక్ లను 
కాపాడుకుందాం

బొగ్గు బ్లాక్ లను 
కాపాడుకుందాం

- Advertisement -

సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష‍ులు సుదీప్‌ ‌దత్త
12వ వేతన ఒప్పందంపై నేటికీ
జేబీసీసీఐ కమిటీనే వేయలే..
లేబర్‌ ‌కోడ్స్‌‌ను అడ్డుకోకుంటే వేతన ఒప్పందం జరగదు : ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్
అఖిల భారత ప్రధాన కార్యదర్శి డిడి.రామానందన్
గోదావరిఖనిలో ఆల్‌ ఇండియా కోల్‌ ‌వర్కర్స్‌‌ ఫెడరేషన్‌ సెమినార్‌

నవతెలంగాణ – గోదావరిఖని
​పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఐక్యంగా పోరాడి కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు బ్లాక్ లను కాపాడుకోవాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష‍ులు సుదీప్ దత్త పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రెడ్డి ఫంక్ష‍న్‌‌హాల్‌‌లో సోమవారం ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు-బొగ్గు పరిశ్రమ-లేబర్ కోడ్స్-వేతన ఒప్పందాలు’ అనే అంశంపై సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్ష‍ులు మంద నరసింహారావు అధ్యక్ష‍తన సెమినార్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా సుదీప్‌దత్త ప్రసంగిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల బొగ్గు పరిశ్రమలో పర్మినెంట్‌ కార్మికుల సంఖ్య తగ్గిపోతూ కాంట్రాక్టు ఉద్యోగాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌, పర్మినెంట్‌ కార్మికులు ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పటికీ జీతాలలో భారీ వ్యత్యాసం ఉండటం వల్ల ఐక్యత దెబ్బతింటోందని, దీనివల్ల ప్రభుత్వం, యాజమాన్యాలు తాము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నాయని

తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు బ్లాక్ ల రక్షణ, ఉద్యోగస్తుల వేతన ఒప్పందాలు- హక్కుల రక్షణ కోసం పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగస్తులు కలిసి ఐక్యంగా పోరాడాలని, ప్రభుత్వాల ‌కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ అఖిలభారత ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యులు డిడి.రామానందన్ మాట్లాడుతూ.. జులై నుంచి 12వ వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉందని, కానీ, దీని కోసం జేబీసీసీఐ కమిటీని ఇంతవరకూ ఏర్పాటు చేయలేదని అన్నారు. యాజమాన్యం లేబర్ కోడ్స్ అమలు కోసం చేసిన ప్రయత్నాలను కలకత్తాలో జరిగిన జేసీసీ సమావేశంలో అన్ని కార్మిక సంఘాలూ తిప్పికొట్టాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ అమలుకు ఉత్సాహం చూపుతున్నారు గానీ వేతన ఒప్పందంపై సానుకూలత వ్యక్తం చేయడం లేదన్నారు. జులై 1 నుంచి దేశవ్యాప్తంగా దశలవారీ ఆందోళనలు నిర్వహిస్తా మని తెలిపారు. ఈ సెమినార్ లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు, రామగుండం ఏరియా మూడు బ్రాంచీల నుండి అధ్యక్ష, కార్యదర్శులు వంగల శివరాం రెడ్డి, శ్రీనివాస్, కుంటా ప్రవీణ్, దొమ్మేటి కొమరయ్య, మందమరి నుండి సాంబారు వెంకటస్వామి, శ్రీరాంపూర్ ఏరియా నుంచి చంద్రశేఖర్, భూపాలపల్లి సాయిలు, కొత్తగూడెం విజయగిరి శ్రీనివాస్, మణుగూరు ఏరియాల నుంచి దాదాపు 300 మంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -