జూన్ 25 నుంచి అక్టోబర్ 10 వరకు షెడ్యూల్ ఖరారు
ప్రతి ఇంటిని బీఎల్‌ఓ మూడుసార్లు సందర్శిస్తారు
ఓటర్ మ్యాపింగ్‌కు 2002 సర్
ప్రామాణికం కాదు: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మొదటి విడత ప్రక్రియ మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 25 నుంచి జులై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. జులై 1న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అంభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం అనంతరం అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఇందుకు సంబంధించి ఈఆర్‌ఓ, బీఎల్‌ఓలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. బీఎల్‌వోలు ప్రతి ఇంటిని సందర్శించి రెండు ప్రతుల ఓటరు నమోదు ఫారాలను అందజేస్తారు. బీఎల్‌వో ఇంటిని సందర్శించినప్పుడు ఇల్లు తాళం వేసి ఉంటే, కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. ఓటర్లు తమ నమోదు ఫారాలను ఆన్‌లైన్‌లో కూడా డౌన్లోడ్ చేసుకుని పూరించి సమర్పించవచ్చు. నిర్దిష్ట సమయంలో నమోదు ఫారం సమర్పించలేని ఓటర్లు, క్లెయిమ్ లు, అభ్యంతరాల కాలంలో నిర్దేశిత ప్రకటన ఫారంతో పాటు ఫారం-6 సమర్పించి పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు సమర్పించని ఓటర్ల విషయంలో ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు విచారణ చేస్తారని అన్నారు. విచారణ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అయినా జాబితాపై అభ్యంతరాలుంటే ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి (ఈఆర్‌వో) తీసుకున్న ఏ నిర్ణయంపైనైనా ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 24(a) ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేయవచ్చన్నారు. మొదటి అప్పీల్ అధికారి నిర్ణయంపై 25 24(b) ప్రకారం రిజిస్ర్టేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1960లోని రూల్ 27 ప్రకారం ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)కు రెండో అప్పీల్ చేయవచ్చు. అన్ని జిల్లాల్లో సర్ హెల్ప్ డెస్క్‌లను ఈసీ ఏర్పాటు చేసింది.
విదేశాల్లో ఉంటే…
కుటుంబంలో అర్హత కలిగిన ఓటరు విదేశాల్లో ఉన్నా, దేశంలోని ఏ ఇతర నగరంలో ఉపాధి పొందుతున్నా సంబంధిత ఓటరు ఎన్యూమరేటర్ ఫారంను కుటుంబ యజమానికి అందజేస్తారు. అతను అందుబాటులో లేని ఓటరు వివరాలను పూరించి బీఎల్‌ఓకు అందజేస్తారు. ఓటరు తరపున డిక్లరేషన్ సమర్పిస్తారు. అందులో సమర్పించిన వివరాలు, ధృవీకరణ పత్రాలు సరైనవే అయితే సదరు వ్యక్తి ఓటును తుది జాబితాలో ప్రచురిస్తారు.
2002 సర్ తప్పని సరికాదు
ఓటర్లు తమ పేరు లేదా తమ తల్లిదండ్రులు, తాత లేదా అమ్మమ్మ పేర్లు 2002 ప్రత్యేక సమగ్ర సవరణ ఓటరు జాబితాలో ఉన్నట్లయితే వాటి వివరాల ఆధారంగా బీఎల్‌ఓ మ్యాపింగ్ చేస్తారు. వారు కూడా ఆ సమయంలో నమోదు చేసుకోకపోయినా, తల్లిదండ్రులు లేని వారయినా అది తప్పని సరి కాదు. అలాంటి వారు తమ స్థానికతను రుజువు చేసుకునేందుకు ఆధార్ కార్డు మినహా 11 గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. అందులో ఏదైనా ఒక కార్డును బీఎల్‌వోకు సమర్పించాలి.
గుర్తింపు కార్డులు
1)కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్ కార్డులు
2). 1987 జులై 1 కి ముందు ప్రభుత్వ, స్థానిక అధికారులు, బ్యాంకులు, పొస్టాఫీసులు, ఎల్‌ఐసీల ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డు
3). సమర్థ అధికార సంస్థ జారీ చేసిన్ జన్మ ధృవీకరణ పత్రం
4). పాస్ పోర్ట్ ,గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేసిన టెన్త్ సర్టిఫికెట్
6). సమర్థ అధికార సంస్థ జారీ చేసిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం
7). అటవీ హక్కుల ధృవీకరణ పత్రం
8). సమర్థ అధికార సంస్థ జారీ చేసిన ఎస్సీ, ఎస్టీ కుల దృవీకరణ పత్రం
9). నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)
10). రాష్ట్ర, స్థానిక అధికారులు తయారు చేసిన ఫ్యామిలీ రిజిస్ట్రర్ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి/ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం
తెలంగాణ సర్ షెడ్యూల్
1). ఇంటింటి గణన… జూన్ 25 నుంచి జులై 24 వరకు
2).ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ….జులై 31
3).అభ్యంతరాల దాఖలు ……. జులై 31 నుంచి ఆగస్టు 08 వరకు
4). అభ్యంతరాల పరిష్కారం… జులై 31 నుంచి ఆగస్టు 28 వరకు
7). తుది ఓటరు జాబితా ప్రచురణ………………. అక్టోబర్ 1
సర్ మొదటి విడతకు ఈసీ ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



