పాఠశాలకు విద్యార్థులు హాజరు..ఉపాధ్యాయులు డుమ్మా..!

– గిరిజన ఆశ్రమ పాఠశాలలో అద్వాన పరిస్థితి

– అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే
నవతెలంగాణ-అచ్చంపేట : చెంచు, గిరిజన విద్యారులందరికీ వసతి తో పాటు ప్రాధమిక విద్యను అందించటానికి గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశారు. అధికారుల పరయవేక్షణ లేకపోవడంతో హెడ్మాస్టర్లు ఇష్టానుసారంగా నిర్వహిస్తూన్నారు. మంగళవారం నవతెలంగాణ అటవీ ప్రాంతంలోని లింగాల మండలం అప్పాపుర్ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించడంతో అనేక సమస్యలు, విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశలలో 1 నుంచి 5 తరగతులలో 56మంది విద్యార్థులకు 32 మంది విద్యార్థులు వచ్చారు. నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఒక్కరూ కూడా విధులకు హాజరు కాలేదు. డైలీ వైజ్ కార్మికుడు లింగయ్య విద్యారలకు మధ్యాహ్నాం భోజనం పెట్టారు. వారంలో మూడు రోజులు మాత్రమే చదువు చెపుతున్నారని తెలుస్తుంది. ఉపాధ్యాయులు వంతుల వారీగా హాజరు అవుతున్నారని  చెంచులు తెలుపుతున్నారు.  గత 10రోజులుగా గుడ్లు, పండ్లు పెట్టడం లేదు. విద్యారులకు బెడ్ పరుపులు ఇవ్వకుండా నిరుపయోగంగా ఉన్నాయి. సోలార్ పలకలు పనిచేయక నీటి కోసం అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు లేవు, టాయిలెట్లు లేవు. ఒకటికి, రెండుకి విద్యార్థులు అడవిలోకి వెళుతున్న దుస్థితి. వంటగది పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, విధులను నిర్లక్ష్యం చేస్తున్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విధులను నిర్లక్ష్యం చేస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలి
 – శంకర్ నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి
అప్పాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న వారిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలి. గిరిజనుల విద్యను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు.గిరిజన ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై అధికారుల పరిరక్షణ ఉండాలి.
Spread the love