మహాలక్ష్మి పథకాన్ని వ్యతిరేకిస్తూ..గజ్వేల్‌లో ఆటో కార్మికుల నిరసన

– ఆర్టీసీలో ఉద్యోగం కల్పించండి
నవ తెలంగాణ -గజ్వేల్‌
మహాలక్ష్మి పథకాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం గజ్వేల్‌లో ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. 500 ఆటోలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అర్హులైన ఆటో డ్రైవర్లను ఆర్టీసీలో డ్రైవర్‌గా, హెల్పర్‌గా తీసుకోవాలన్నారు. ఆటో సేవలను ప్రభుత్వ సంస్థలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లను త్వరలో ఆదుకోవాలన్నారు. లేదంటే ఆటో కార్మికులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. తమకు న్యాయం చేయాలని, లేకుంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Spread the love