
నవతెలంగాణ – తాడ్వాయి
మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ ఇందిరానగర్ పాఠశాలలో గురువారం విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తోటి విద్యార్థులకు బోధన చేసి, ఉపాధ్యాయులతో విద్యార్థులు ప్రశంసలు పొందారు పొందారు. ఉత్తమ బోధన చేసిన విద్యార్థులకు ఘనంగా సన్మానించిన ఉత్తమ ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రధానం చేశారు. ప్రధానోపాధ్యాయురాలుగా ఆర్ జ్యోతి, స్నేహ ఆర్జెడి కే స్పందన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేగ కేశవరావు మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని కోరారు. పాఠశాలలో చదివిన విద్యార్థులు బాగా కష్టపడి చదివి పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హెచ్ఎం రేగా కేశవరావు, ఉపాధ్యాయులు బాబురావు, పాపారావు చంద్ర రెడ్డి రవీందర్ రజిత రేణుక వెంకటలక్ష్మి , విద్యార్థులు గ్రామస్తులు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.