Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కిషోర్ బాలికలకు సైబర్ క్రైమ్ పై అవగాహన 

కిషోర్ బాలికలకు సైబర్ క్రైమ్ పై అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పోలీసులు సైబర్ క్రైమ్స్‌పై ప్రత్యేక అవగాహన కల్పించారు. సోషల్ మీడియా మోసాలు, సైబర్ బెదిరింపులు, వ్యక్తిగత సమాచారం గోప్యత, ఆన్‌లైన్ వేధింపుల నుంచి ఎలా రక్షించుకోవాలో ఈ కార్యక్రమాల ద్వారా వివరించారు.కిశోర విద్యార్థినులు, యువతులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు సోషల్ మీడియా, ఆన్‌లైన్ భద్రతవ్యక్తిగత సమాచారం  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, మొబైల్ నంబర్లు, ఇంటి చిరునామాలు షేర్ చేయవద్దు పంపవద్దని సూచించారు.  సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా కాకుండా, ప్రైవేట్‌గా ఉంచుకోవాలను,. మీకు తెలియని వారిని ఫ్రెండ్ రిక్వెస్ట్ లుగా అంగీకరించవదని తెలిపారు .ఆన్‌లైన్ మోసాలు లాటరీలు , ఉచిత బహుమతులు , ఉద్యోగాల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవదని,  ఓటీపీలు లేదా పాస్‌వర్డ్‌లు చెప్పవదని అన్నారు. కార్యక్రమంలో ఏపిఎం పద్మావతి, సీసీ రాజు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -