- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని రామారెడ్డి ఏఈఓ గా పనిచేసి బదిలీపై వెళ్తున్నందుకు బాధగా ఉన్నా, రైతు సోదరులు నాకు సహకరించిన సహకారం మరిచిపోలేనిదని బుధవారం ఏఈఓ రాకేష్ అన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు, ఆయా గ్రామాల నాయకులు, తోటి ఉద్యోగుల సహకారంతో రైతులకు సేవ చేశానని, వ్యవసాయ అధికారుల సూచన మేరకు రైతులు పంట మెలుకువలు తెలుసుకొని మంచి పంటలు పండించి లబ్ధి పొందాలని కోరుకుంటున్నానని అన్నారు.
- Advertisement -



