నవతెలంగాణ-రాయికల్
మండలంలోని బోర్నపల్లి గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా కడెం మండలం పెరికపల్లి గ్రామానికి చెందిన రైతు బొడ్డు సత్తన్న తనకు చెందిన రెండు ఆవులను బోర్నపల్లి శివారులోని పొలం వద్ద కట్టి ఉంచాడు. అయితే ఆవులు తాళ్లు తెంపుకొని సమీపంలోని 11 కేవీ విద్యుత్ లైన్ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత చెందినట్లు రైతు తెలిపాడు. ఒకేసారి రెండు ఆవులు మృత్యువాత చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. పాడి పశువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబానికి ఈ ఘటన ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని కలిగించిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నష్టపోయిన రైతుకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
విద్యుత్ షాక్‌తో రెండు ఆవులు మృత్యువాత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



