Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించాలి

 ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించాలి

- Advertisement -

 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  అధికారిని రాజశ్రీ  
 నవతెలంగాణ-ఆర్మూర్

రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు గా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని,  బస్తీదవాఖాన ని బుధవారం  ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను, మందుల నిల్వ రిజిస్టర్ను, ఓపి రిజిస్టర్ను, తనిఖీ చేశారు. సిబ్బందికి సమయపాలన పాటించాలని సూచించారు. వచ్చేది వర్షాకాలం కావున సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.బుధవారం జరుగుతున్న చిన్న పిల్లల టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు,ప్రభుత్వ ఆసుపత్రిలో నే డెలివరీలు అయ్యేలాగా చూడాలని కోరారు, ఈ కార్యక్రమంలో Dr. ప్రీతిఫావని బస్తి దవాఖాన వైద్యాధికారి,స్టాఫ్ నర్స్, ఆరోగ్య కార్యకర్త, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చేపూర్ గ్రామంలో…
ఆరోగ్య ఉపకేంద్రాన్ని  బుధవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను, మందుల నిల్వ రిజిస్టర్ను, ఓపి రిజిస్టర్ను, వ్యాధి నిరోధక టీకాల అర్హుల ముందస్తు జాబితాను తనిఖీ చేశారు. ప్రతి ఒక్క చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు అందే విధంగా చూడాలన్నారు. ఈ నెలలో 28వ తేదీన జరిగే పల్స్ పోలియోకు 0 to 5 సంవత్సరాల పిల్లల జాబితాను తయారు చేసుకుని పెట్టుకోవాలని సూచించారు. సిబ్బందికి సమయపాలన పాటించాలని సూచించారు. వచ్చేది వర్షాకాలం కావున సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్, సువర్ణ, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -