నవతెలంగాణ – పెద్దవూర
గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా, గిరిజనుల సంక్షేమం కోసంకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పీఎం ధర్తీ ఆబ – జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభ్యాన్ పథకం కనీస వసతులు లేనటువంటి నివాస ప్రాంతాలలో ఉంటున్నటువంటి గిరిజన ప్రజలకు రోడ్లు మరియు డ్రైనేజ్, నీళ్లు, ఆరోగ్యం, విద్యుత్తు, గృహ నిర్మాణం, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, జల్జీవన్ ద్వారా గ్రామాల్లో సురక్షిత త్రాగునీరు, సికిల్ సెల్ ఎనిమియా క్యాంపు ల ద్వారా గిరిజన తండాల్లో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, అంగన్వాడి సెంటర్స్ కు నూతన భవనాలు మరియు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మంగళవారం భగవాన్ బిర్సా 150వ జయంతి సందర్భంగా నవంబర్ 15 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ధర్తీ అబజన అనే పథకం ద్వారా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో దశలవారీగా చేపట్టాల్సిన పనులకు అంచనాలను రూపొందించి గిరిజన సంక్షేమం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూ, గిరిజన ప్రజల జీవన ప్రమాణాల నైపుణ్యాల పెంపుదలకు మరియు తండాల అభివృద్ధికి గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని నాగార్జునసాగర్ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ డిటిడిఓ ఎస్పి రాజ్ కుమార్ పెద్దవూర మండలం కేంద్రంలోని తుంగతుర్తి, చలకుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని ఆవాస ప్రాంతాలను కలుపుతూ నిర్వహించిన గ్రామసభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.. ఈ పథకం గురించి గిరిజన ప్రజలకు అవగాహన కల్పిస్తూ తదనంతరం ఈ పథకానికి సంబంధించిన కరపత్రాలను సంబంధిత గ్రామస్తులు మరియు మండల స్థాయి అధికారులతో కలిసి ఆవిష్కరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఉమాదేవి,మండల విద్యాధికారి తరిరాము, అంగన్వాడి సూపర్వైజర్:వెంకాయమ్మ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కొల్లు బాలకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి,అహల్య, శ్రీనివాస్, సుధాకర్ మరియు గ్రామపంచాయతీ కార్యదర్శులు రవీందర్ రెడ్డి, రామకృష్ణ, దశ్రు తదితరులు పాల్గొన్నారు.