– తొర్రూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత
నవతెలంగాణ – నెల్లికుదురు
మహిళలకు గృహహింస చట్టాలపై అవగాహన కల్పించినట్లు తోరూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్టా సరిత తెలిపారు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించి అనంతరం ఐకెపి వెలుగు కార్యాలయంలో మహిళలకు గృహహింస చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. ప్రతి విద్యార్థి గురువులు చెప్పే పాఠాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి సబ్జెక్టును అర్థం చేసుకొని ప్రతి పరీక్షలో ప్రతిభ కనబరిచి పాఠాలు బోధించిన గురువుకు కన్న తల్లిదండ్రులకు కన్న ఊరికి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా ఉన్నంత స్థాయికి ఎదగాలని అన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని అన్నారు ర్యాగింగ్ కు పాల్పడితే చట్టారీత్యా చర్యలు ఉంటాయని అన్నారు. ఈవ్ టీజింగ్ దూరంగా ఉండాలని అన్నారు. అనంతరం ఐకెపి వెలుగు కార్యాలయంలో మహిళలకు గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు గృహహింస జరిగిన ప్రోత్సహించిన వారికి శిక్షలు ఉంటాయని అన్నారు. మహిళలను వేధించిన వెంబడించి ఇబ్బందులకు గురిచేసిన వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే ఆరు మీ వెంట ఉండి మీకు న్యాయం అందించే విధంగా సహకరిస్తారని అన్నారు. ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ.. మీకు ఎలాంటి ఇబ్బందులు ఎవరైనా కలిగించినట్లయితే లేదా ఇబ్బందులకు గురి చేసినట్లయితే లేదా భార్యను భర్త ఇబ్బందులకు గురి చేసినట్లైతే మాకు సమాచారం ఇస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు న్యాయం జరిగే విధంగా మా పోలీసు శాఖ సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చిర్రా రమేష్ బాబు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కవి రాజు ఏబీఎన్ వరదయ్య మయూరి మండల సమైక్య అధ్యక్షురాలు పెరమాండ్ల కవిత కార్యదర్శి తాళ్ల సునీత కోశాధికారి చందవాని అకౌంటెడ్ పుష్పలత పోలీస్ కానిస్టేబుల్ లింగాల రాంబాబు యాకస్వామి కిరణ్ సత్యనారాయణ రామా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయ బృందం ఐకెపి సీసీలు, సిఏలు ,సిబ్బంది పాల్గొన్నారు.