నవతెలంగాణ- ఆత్మకూర్
ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం ఎస్సై వీ.నరేందర్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగా హన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎస్సై మాట్లా డుతూ మీ అకౌంట్‌కు సంబంధించి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ని నమ్మవద్దని, అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీి వివరాలను అడిగితే చెప్ప వద్దన్నారు. అలాగే వాట్సప్ గ్రూపుల్లో వచ్చే ఏపిక్ ఫైల్స్‌ని మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవద్దని సూచిం చారు. కార్యక్రమంలో ఏఎస్సై రోషన్న, కానిస్టేబుల్స్ బాలరాజు, భీమయ్య, విద్యార్థులు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.