– విద్యార్థినులకు క్విజ్ పోటీ, బహుమతులు అందజేత
నవతెలంగాణ – సత్తుపల్లి
పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ‘శ్రీ వెంకటేశ్వర ఇండేన్ గ్యాస్’ నిర్వాహకులు వందనపు సత్యనారాయణ (గ్యాస్) ఆధ్వర్యంలో ‘ఎల్‌పీజీ’ గ్యాస్ సురక్షిత వినియోగంపై విద్యార్థినులకు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎల్‌పీజీ అంటే ఏమిటి?, గ్యాస్ సిలిండర్‌లో ఉండేది ఏమిటి?, సిలిండర్ బరువు, గ్యాస్ గాలి కంటే బరువా?, గ్యాస్‌ను ద్రవ రూపంలోకి మార్చడం, రెగ్యులేటర్ నుంచి వచ్చే ఒత్తిడి, రబ్బర్ ట్యూబ్ ఉండాల్సిన పొడవు, గ్యాస్ లీకేజీని ఎలా గుర్తించాలి?, లీకైనప్పుడు గ్యాస్ బయటకు వెళ్లే విధానం వంటి విషయాలపై 20 బహుళైచ్చిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలతో క్విజ్ పోటీని నిర్వహించారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్తుపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ) తుమ్మలపల్లి శ్రీహరి, ఇండియన్ ఆయిల్ సేల్స్ మేనేజర్ ప్రవీణ్, కళాశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, శ్రీ హనుమాన్ దత్త సాయి ఇండేన్ గ్యాస్ మేనేజింగ్ పార్ట్‌నర్ గుండు ఉమామహేశ్వరరావు, ఇండేన్ గ్యాస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



