గర్భిణీలకు పౌష్టికాహారం పై అవగాహన

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ లో బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. పోషణ పక్షంలో భాగంగా  గ్రామంలోని శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులైన గర్భిణులకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ గర్భిణీలు పోషకాలు అందేలా ఏ ఆహారం తీసుకోవాలో  వివరించారు. గర్భంతో  ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీలకు వివరించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆకుకూరలు, చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా గర్భిణులకు కావలసిన పౌష్టికాహారం అందుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా అధిక పోషకాలు, పౌష్టికాహారం లభించే ఆహార పదార్థాలను ప్రదర్శించారు.కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, సరిత, శోభ, లక్ష్మి, ఏఎన్ఎం అరుణ కుమారి, ఆశా కార్యకర్తలు, చిన్నారుల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love