
భువనగిరి పట్టణంలోని గ్రంథాలయ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాత జిల్లా కేంద్ర గ్రంథాలయము సింగన్నగూడెం హౌసింగ్ బోర్డ్ కాలనీలలో ఉన్న పబ్లిక్ రీడింగ్ వాళ్లకు పట్టణంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సందర్శించారు. అక్కడ ఉన్న సమస్యలను వార్డు సభ్యులతో అడిగి తెలుసుకొని అక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సుధీర్ గారు మరియు భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్,10వ వార్డ్ అధ్యక్షులు మహమ్మద్ అమానతుల్లా, అరాల రాజశేఖర్ రెడ్డి, సర్వేశం, పిన్నింటి బలరాం రెడ్డి, కవిత రాజు, పాలడుగు శేఖర్ రామ్ రెడ్డి పాల్గొన్నారు.