నవతెలంగాణ-హైదాబాద్: అయోధ్య విరాళాల స్కాంలో రామ మందిర్ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరిని విచారించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమండ్ చేశారు. ఆయన పదవీ కాలంలోనే విరాళాల దుర్వినియోగం జరిగిందని, దర్యాప్తు అధికారులు ఆయనను కూడా విచారించాలన్నారు. అయోధ్య ఆలయ నిధులను భద్రపరచడం, ఖాతాలను నిర్వహించడంలో కోశాధికారికి ప్రధాన బాధ్యత ఉంటుందని, ఈ నేపథ్యంలో విరాళాల ఆర్థిక అవకతవకల్లో ఆయన పాత్రపై కూడా విచారణ జరగాలని గురువారం ముంబాయి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
“రామ మందిరం హిందువుల విశ్వాసానికి మాత్రమే కాకుండా దేశానికి గర్వకారణం కూడా. దీని నిర్మాణం కోసం లెక్కలేనంత మంది త్యాగాలు చేశారు. జూలై 18న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న ‘రామ రక్షా’ ఉద్యమంలో పాల్గొనవలసిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశాను. రామ మందిర్ లో భక్తుల విరాళాల చోరీని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నిర్వహిస్తామని` ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు.



