
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగల్లు పీహెచ్ సీ సీనియర్ అసిస్టెంట్ బి రత్నంరాజు ను నియమి స్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షు రాలు రామలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా రత్నం రాజు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజాత రాథోడ్, కోశాధికారి గోవింద్ నాయక్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎమ్ ఎస్ మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్ , కవితలకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య శాఖలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.