మందుబాబులకు బ్యాడ్ న్యూస్…

నవతెలంగాణ – హైదరాబాద్: మద్యం తాగడంవల్ల ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 30 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. మద్యం, ఆరోగ్యానికి సంబంధించి డబ్ల్యూహెచ్ వో తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. ఆల్కహాల్ తాగి వాహనాలను నడుపుతుండటం ప్రధాన కారణమని వెల్లడించింది. మరణించినవారిలో మూడోవంతు పురుషులే ఉంటున్నారు. మత్తుపానీయాలను వినియోగించడంవల్ల వ్యక్తిగత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని, మానసిక ఆరోగ్యంపై ప్రభావంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోందని సంస్థ వెల్లడించింది.
అయితే ఇందులో ఉన్న సానుకూలమైన అంశం ఏమిటంటే 2010 నుంచి ప్రపంచవ్యాప్తంగా మద్యం తీసుకోవడం కొంతవరకు తగ్గింది. అయితే మద్యం వల్ల ఆరోగ్యం, సామాజిక భారం ఎక్కువగానే ఉంది. 2019లో సంభవించిన మరణాల్లో 20 నుంచి 39 సంవత్సరాల్లోపు ఉన్నవారు 13 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొన్నిరకాల వ్యాధులు మద్యపానం సేవించడంవల్లే వస్తున్నాయి. ఈ ఏడాదిలో నాలుగు లక్షల మంది క్యాన్సర్ వల్ల, ఏడు లక్షల మంది ట్రాఫిక్ ప్రమాదాలతో మరణించారు. 2019లో 209 మిలియన్ల మందికి మద్యం తాగే అలవాటుంది. ప్రపంచ జనాభాలో ఇది 3.7 శాతంగా ఉంది.

Spread the love