నవతెలంగాణ – ఊరుకొండ : త్యాగం, ప్రేమ, సేవలను, త్యాగాన్ని, సోదర భావాన్ని, భక్తిశ్రద్ధలను గుర్తుచేసే బక్రీద్ సంబరాలు ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకున్నారు. గురువారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అల్లాహ్ దీవెనలు మెండుగా ఉండాలని దువా చేశారు. ఇబ్రహీం ప్రవక్త అల్లాహ్ పట్ల చూపిన అచించల విశ్వాసం గొప్ప త్యాగనిరతిని గుర్తు చేస్తుందని ముస్లిం కుల పెద్దలు బోధించారు. బక్రీద్ త్యాగం, దాతృత్వం, మానవత్వానికి ప్రతిక గుర్తు చేశారు. ఈ సందర్భంగా కులమత బేధ తారతమ్యం లేకుండా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, ముస్లిం కుల పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బక్రీద్ సంబరాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



