పౌష్టికాహారం పిల్లలకు బలిష్టం: అంగన్ వాడీ టీచర్

నవతెలంగాణ – జుక్కల్
పౌష్టికాాహరం పిల్లలకు, గర్భణిలకు, బాలింతలకు తీసుకోవడం వలన బలిష్టంగా ఉంటారని మాదాపూర్ అంగన్ వాడి టీచర్ నర్సుబాయి అన్నారు. సోమవారం నాడు అంగన్ వాడి కేంద్రంలో  చిన్నపిల్లకు అక్షరభ్యాసం చేయించారు. బాలింతలకు, గర్భిణిలకు, పౌష్టికాహరం బాలమృతం, గుడ్లు తదితర పదార్థాలు అందించారు. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామములోని పిల్లల  తల్లి దండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీచర్ మాట్లాడుతూ.. పౌష్టికారం తీసుకోవడం వలన పుట్చబోయే శిశువు ఈరోగ్యంగా ఉంటారని అన్నారు. బాలీంతలకు రక్తహీనత కల్గకుండా నిత్యం పాలు, గుడ్లు, పౌష్టికాహరం అందిస్తున్నామని, అందువల్ల ప్రతి  ఒక్కరూ సద్వినియెాగం  చేసుకోవాలని  తెలిపారు. సెంటర్ లోని పిల్లలకు బరువు, నెలవారిగా నిర్వహించే ఆరోగ్యపరిక్షల  తీసుకోవాల్సిన జగ్రత్తలు వివరించారు. సీజనల్ వ్యాదులు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా, శుభ్రంగా ఉండాలని పేర్కోన్నారు. కార్యక్రమంలో టీచర్ నర్సుబాయి, గ్రామ మహిళలు, తదితరులు పాల్గోన్నారు.

Spread the love