లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు : ఐద్వా రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమారుడు బండి భగీరథ్‌ను ఫోక్సో కేసులో తక్ష?ణమే అరెస్ట్ చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. అభిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మి, అరుణోదయ సాంస్కతిక సంఘం నాయకురాలు విమలక్క, పీఓడబ్ల్యూ1 రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, పిఓడబ్ల్యూ2 రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూప, అంకురం సుమిత్ర, సీఎమ్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు సావిత్రి, జర్నలిస్ట్ వనజ, టాప్రా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ. జర్నలిస్ట్ రాజకుమరి మాట్లాడుతూ బండి భగిరథ్ కేసులో కాలయాపన కోసమే సిట్ వేశారని విమర్శించారు. గతంలో అనేక సిట్‌లలో జరిగిన విధంగానే పోలీసులు ఈ కేసును నీరుగారుస్తారన్నారు. ఫోక్సో కేసులో 24 గంటల్లో అరెస్ట్ చేయాల్సి ఉండగా, పూర్తి ఆధారాలు లభించిన తర్వాతే అరెస్ట్ చేస్తామని దర్యాప్తు అధికారి చెప్పడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసి 7 రోజు అవుతున్నా ఎందుకు అరెస్టు చేయాలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రలోభాలకు లొంగి పోలీస్ యంత్రాంగం కేసును పక్క దారి పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పొద్దున లేస్తే సనాతన ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. మహిళల కోసమే మా సర్కార్ అని చెబుతూ… బేటీ పడావో-బేటీ బచావో నినాదాన్ని ప్రచారం చేసిన ఆ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. చిన్న సంఘటన జరిగినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఆ పార్టీ మహిళా నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? బీజేపీ సర్కార్ ఉందా అర్థం కావడం లేదన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ పోలీస్ అధికారులు బండి భగిరథ్ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఆర్టికల్ 14 ప్రకారం అందరం సమానమే అయినప్పుడు బండి సంజరు కొడుకు ఒక నీతి సాదరణమైన పౌరుడికి మరో నీతి ఎలా అంటూ నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్. ఆశాలత, నవతెలంగాణ జర్నలిస్ట్ ఎస్‌కే.సలీమా, ఐద్వా ట్రెజరర్ మాచర్ల భారతి, బండి పద్మ, రమణ, సత్య, రైటర్ విజయ, శ్రామిక మహిళ సత్య, టీపీఎస్ కే ఝాన్సీ, ఐద్వా సీనియర్ నాయకురాలు విజయ, మస్తాన్ బీ, ఎల్ దీప తదితరులు పాల్గొన్నారు.
బండి బగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



