Friday, May 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅవగాహనా లోపమా..ఆర్థిక ఇబ్బందులా..?

అవగాహనా లోపమా..ఆర్థిక ఇబ్బందులా..?

- Advertisement -

మెదక్‌ జిల్లాలో వరుస శిశువిక్రయాలు
దత్తత పేరుతోనూ అమ్మకాలు ?
శిశు విక్రయాలకు నిలయంగా ప్రయివేటు ఆస్పత్రులు
పట్టించుకోని అధికారులు

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వరుసగా వెలుగుచూస్తున్న శిశు విక్రయాల ఘటనలు కలకలం రేపుతున్నాయి. పుట్టిన పసికందును డబ్బుల కోసం అమ్మేస్తున్న ఘటనలు సమా జాన్ని కలచివేస్తున్నాయి. పేదరికం, కుటుంబ పరిస్థితులు, అవగాహన లేకపోవడం, మధ్యవర్తుల ప్రలోభాలు కలిసి శిశువుల విక్రయాలు జరుగుతున్నాయని అన్న చర్చ నడు స్తోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తు న్నారు. అధికారులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటు న్నప్పటికీ, ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్న కుటుంబాలు అప్పుల భారం, ఉపాధి లేకపో వడం, కుటుంబ పోషణ కష్టాల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు మధ్యవర్తులు శిశు విక్రయాలకు పాల్పడుతున్నారని తెలిసింది. పసికందులను అక్రమంగా దత్తత పేరుతో విక్రయించే ముఠాలు పనిచేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఘటనల్లో సామాజిక భయం, కుటుంబ ఒత్తిళ్ల కారణంగా పుట్టిన శిశువులను వదిలించు కునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పిల్లలు లేని కుటుంబాలు చట్టబద్ధ దత్తత ప్రక్రియకు వెళ్లకుండా అక్రమ మార్గాలను ఆశ్రయించడం కూడా ఈ దందాకు కారణమవుతోంది. దీనిపై అవగాహన లేకపోవడమూ ఒక కారణమని తెలుస్తోంది.

ఇటీవల కాలంలోనే వరుస ఘటనలు
నెలరోజుల మగ శిశువును తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో రూ.1.50 లక్షలకు విక్రయించారు. మెదక్‌ జిల్లా హవేలీ ఘనపూర్‌ మండలం లింగసాన్‌ పల్లి తండాకు చెందిన దంపతులు కేతావత్‌ మంజుల, మహేష్‌కు గత నెలలో మగబిడ్డ పుట్టాడు. వారి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మార్చి 4వ తేదీన మెదక్‌ పట్టణంలోని వాళ్లుశిశువును రూ.5లక్షలకు అమ్మేందుకు నిర్ణయించుకుని చివరకు రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అందుకు హవేలీ ఘనపూర్‌ మండలంలోని శాలీపేట గ్రామ శివారులో శిశువును విక్రయిస్తున్నట్టు స్టాంప్‌ పేపర్‌పై రాయించుకుని ఇరు దంపతులు సంతకాలు తీసుకుని బాబుని వారికి అప్పగించారు. మరో ఘటనలో.. మెదక్‌ కేర్‌ ఆస్పత్రిలో ప్రసవానికి వస్తే పుట్టిన శిశువును అమ్మేశారు. తల్లికి తెలియకుండా రూ1.50 లక్షలకు విక్రయించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేయగా, 2.4 కిలోల బరువున్న ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డను తల్లికి తెలియకుండానే విక్రయించారు. బిడ్డ కడుపులోనే మృతి చెందినట్టు నమ్మించారు. రెండు రోజుల తర్వాత ఆస్పత్రికి చెందిన సిబ్బంది ద్వారా పుట్టిన బిడ్డ బతికున్నట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని యాజమాన్యాన్ని నిలదీశారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శిశువిక్రయ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేవలం నలుగురిపై కేసు నమోదు చేసి జిల్లా వైద్యాధికారితో ఆస్పత్రిని సీజ్‌ చేయించారు.

ముగ్గురు పిల్లలున్నారని వికయ్రం..
కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన దంపతులకు ఇదివరకే ముగ్గురు సంతానం ఉండగా మార్చి 27వ తేదీన మెదక్‌లోని ఓ ఆస్పత్రిలో మరో బిడ్డకు జన్మించింది. ఆ పాపను దంపతులిద్దరూ రూ.3 లక్షలకు కొంత మంది మధ్యవర్తుల ద్వారా సిద్దిపేట జిల్లా ములుగు మండలం అల్లీనగర్‌కు చెందిన దంపతులకు విక్రయిం చారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి పాపను తీసుకొచ్చి మహిళా శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు.

అవగాహనా కార్యక్రమాలు ఎక్కడ..?
ప్రభుత్వ శాఖలు, మహిళా శిశు సంక్షేమ విభాగం, ఐసీడీఎస్‌, గ్రామస్థాయి సిబ్బంది ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. చట్టబద్ధ దత్తత విధానాలపై గ్రామీణ ప్రజలకు సరైన సమాచారం అందడం లేదు. ఆర్థిక కష్టాల్లో ఉన్న గర్భిణీలు, ఒంటరి మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరకపోవడమూ ఇందుకు ఒక కారణం. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రయివేట్‌ క్లినిక్‌లు, ప్రసూతి కేంద్రాల వద్ద సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా సమస్యకు కారణమవుతోందని తెలుస్తోంది. గర్భిణీల వివరాలు, ప్రసవాల నమోదులో నిర్లక్ష్యం ఉండటం వల్ల మధ్యవర్తులు సులభంగా తమ పని కొనసాగిస్తున్నారని ఆరోపణలు న్నాయి. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. శిశువిక్రయాలపై కేవలం కేసులు నమోదు చేయడం సరిపోదని, మూల కారణాలపై దృష్టి పెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, ఒంటరి మహిళలకు రక్షణ, చట్టబద్ధ దత్తతపై అవగాహన, గ్రామస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు అవసరమని సూచిస్తున్నారు. అక్రమ దత్తత ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు.

శిశువులను విక్రయిస్తే కఠిన చర్యలు
అక్రమ పద్ధతిలో శిశు దత్తత, శిశు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటార. ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మహిళా శిశు సంక్షేమ శాఖలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన దంపతులు వారికి పుట్టిన ఆడశిశువు నాల్గవ సంతానం కావడంతో రూ.3లక్షలకు విక్రయిం చారు. దీనిపై విచారణ చేపట్టి శిశువును విక్రయించిన వారిపై కేసులు నమోదు చేశార. ఎవ్వరైనా అక్రమంగా శిశువులను విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.
మెదక్‌ జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -