Friday, May 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలిచారు: కాంగ్రెస్

బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలిచారు: కాంగ్రెస్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: మూడో ద‌ఫా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సిద్ద‌మైన విష‌యం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ మూడో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వ‌చ్చే నెల 21 నుంచి తెలంగాణ‌లో స‌ర్ ప్ర‌క్రియ మొద‌లు కానుంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని క‌లిశారు. రాష్ట్రంలో జరిగే సర్ ప్రక్రియపై ఎస్ఈసీకి వినతిపత్రం అందజేశారు.

ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఓట్ల జోరీ జరిగిందని బెంగాల్ ఎన్నికలే నిదర్శనం అని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. తెలంగాణలో బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలిచారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు లేవని ఎస్ఐఆర్ ప్రక్రియ ఏడాది పొడవున చేయాలని డిమాండ్ చేశారు. సి.సుదర్శన్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగే సర్ ప్రక్రియపై ఎస్ఈసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. సర్ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని కోరినట్లు తెలిపారు.
ఎస్ఈసీకి వినతిపత్రం:

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -