– కలెక్టర్ రాజర్షి షా
– అధికారికంగా బాపూజీ జయంతి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
తెలంగాణ ఉద్యమంలో ఆచార్య కోండ లక్ష్మణ్ బాపూజీ కీలకంగా వ్యవహరించారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కోండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించారు. పట్టణంలోని ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి వేడుల్లో పాల్గొన్న అథితులను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అనేక మంది ఉద్యమకారులకు కొండ లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు. బడుగుబలహీన వర్గాల ప్రభుత్వం కూడా అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. హ్యాండ్ లూం టెక్నాలజీ సంస్థలకు ఆయన పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించిందన్నారు. కొండ లక్ష్మణ్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. అదే విధంగా కొత్త కలెక్టరేట్ కు కొండ లక్ష్మణ్ పేరును పెట్టాలని పద్మశాలి సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ కోరారు. మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో..
బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ బంగ్లా సమీపంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. జడ్పీ, మున్సిపల్ చైర్మెన్‌లు జనార్ధన్ రాథోడ్, జోగు ప్రేమేందర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు నారాయణ, జగదీశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల నివాళ్లు
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నాయకురాలు ఆత్రం సుగుణక్క, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌తో కలిసి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించి అయన సేవలను కొనియాడుతూ నినాదాలు చేసారు. కార్యక్రమంలో యువజన జిల్లా అధ్యక్షులు సాయి చరణ్ గౌడ్, ఉపాధ్యక్షులు వేముల నాగరాజ్, మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, ఎస్టీ సెల్ చైర్మన్ సేడ్మాకి ఆనంద్ రావు, నలిమేలా నవీన్ రెడ్డి, సునీల్ జాదవ్, రూపేష్ రెడ్డి, సవిన్ రెడ్డి, పోత రెడ్డి పాల్గొన్నారు.
కామర్స్ కళాశాలలో బాపూజీ జయంతి
పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ అతిక్ బేగం పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గణపతి రఘు, ఎన్‌సీసీ కేర్‌టేకర్ చంద్రకాంత్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం అధికారి పృథ్వీరాజ్, విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.
కుభీర్ : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నవనీత్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోముతో పాటు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయంలో శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ముందుగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో మండల ఎంపీఓ మోహన్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ పద్మావతి, అధికారులున్నారు.
ఖానాపూర్ టౌన్ : కొండ లక్ష్మన్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. చైర్మెన్ చిన్నం సత్యం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జన్నారపు శంకర్, పరిమి సురేష్, నాయిని సంతోష్, తోట సత్యం, మున్సిపల్ మేనేజర్ సురేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
లోకేశ్వరం : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళశాల ప్రిన్సిపాల్ గౌతం, అధ్యాపకులు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నవీన్, చిన్నయ్య, విఠల్, ప్రమీల, సాయినాథ్, హరీశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇచ్చోడ : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. మందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, అధ్యాపకులు ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, సోమన్న, గోవేర్దన్, బాలాజీ, శ్రీనివాస్, భాస్కర్, రాజేశ్వర్, నాగభూషన్, మాదవి, ప్రవీణ పాల్గొన్నారు.
తాంసి : తాంసి, భీంపూర్ మండల ప్రభుత్వ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు. మొదటగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జయంతి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ, ప్రిన్సిపాల్ సుదర్శన్, సీనియర్ అసిస్టెంట్ నరేశ్, ఆర్‌ఐ సంతోష్, జూనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర, సిబ్బంది లలిత, అశోక్, అడెల్లు, స్వాగత్, రాహుల్, ప్రశాంత్, ప్రవీణ్, రఫీక్, అశోక్ పాల్గొన్నారు.
బోథ్ : ఆచార్య కొండ లక్ష్మణ్ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికుంట్ల ఆశమ్మ, పట్టణ అధ్యక్షుడు భోజాన్న, మండల అధ్యక్షుడు అసల సదాశివ్, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, నాయకులు బలరాం జాదవ్ పాల్గొన్నారు.