మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన బార్ అసోసియేషన్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సోమవారం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు యాళ్ల శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఏజిపి సదానందం, కార్యవర్గం సభ్యులు చిత్తారి హన్మయ్య , సాయిని మల్లేశం , మిట్టపల్లి ఎల్లారెడ్డి, బాకం సంపత్, నాగరాజు, పాల్గోన్నారు.
Spread the love