ప్రైవేట్‌ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ రిజర్వేషన్లు పెట్టాలి

– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌.కష్ణయ్య
నవతెలంగాణ-ముషీరాబాద్‌
ప్రైవేట్‌ యూనివర్సిటీలో ఎస్సీ,ఎస్టీలతోపాటు బీసీ రిజర్వేషన్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌.కష్ణయ్య అన్నారు. మెగా డీఎస్సీ ప్రవేట్‌ యూనివర్సిటీలో ఎస్సీ , ఎస్టీ రిజర్వేషన్లపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షు లు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో విద్యానగర్‌ బీసీ భవన్‌ లో బీసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్‌ కష్ణయ్య హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మెగా డీఎస్సీ వేసి పెద్ద ఎత్తున టీచర్‌ పోస్టులు వేస్తామని ప్రకటించడం హర్షనీయ మన్నారు. టీచర్‌ పోస్టులు సంఖ్య విషయంలో అధికారులు ఆధారపడకుం డా నిరుద్యోగుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సమా వేశం జరిపి చర్చలు జరపాలని కోరారు. గత ప్రభుత్వం టీచర్‌ పోస్టులు భర్తీ చేయకపోవడం వేల పాఠశాలలో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు చదువుల్లో వెనుక బడిపోయారన్నారు. టీచర్‌ పోస్టుల భర్తీ ని నిరుద్యోగు లకు ఉద్యోగం ఇస్తున్నామనే బడ్జెటు ఖర్చు అవుతుందని కోణంలో చూడరాదని భావి భారత పౌరు లైన భాలలను తీర్చిదిద్ది ఈ సమాజానికి ఉపయోగ పడే గొప్ప వారికి తయారు చేస్తామన్నామనే కోణంలో చూడాలని తెలిపారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెట్టి యూనివర్సిటీ క్రమబద్ధీకరణ చేస్తామని సీఎం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలు స్థాపించిన ప్పుడు ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, అసెంబ్లీ లోపల – బయట చాలా పోరాటం చేశామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రిజర్వే షన్లు పెట్టలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రకటనలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ ప్రకటించలేదు,బీసీల విషయం ప్రస్తావించలేదు, బీసీలకు కూడా రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు .ఈ సమావేశంలో గుజ్జ కష్ణ, అంజి, సురేశ్‌, ఉదరు, జయంతి, లింగయ్య యాదవ్‌, నిఖిల్‌, ఈలేశయ్య, ప్రియా, దుర్గా రాణి పాల్గొన్నారు.

Spread the love