సమాచార హక్కు వికాస సమితిలో సభ్యత్వం తీసుకోండి


నవతెలంగాణ పెద్దవూర: సమాచార హక్కు వికాస సమితిలో సభ్యులుగా చేరాలని ఆ సమితి పౌండేషన్ అధ్యక్షులు యరమాద కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం పెద్దవూర మండలంలో మాట్లాడుతూ.. ఆర్టీఐ యాక్టు -2005 చట్టాలపై వీడియోలు, మెసేజ్లు వాట్సాప్, యూట్యూబ్ ద్వారా చూస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి సలహాలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి మాత్రమే సమాచార వికాస సమితి నిర్వహించే అవగాహన సదస్సుల్లో పాల్గొనే అవకాశంఉంటుందని అన్నారు. మీ పని చేసుకుంటూనే చట్టాలు, హక్కులపై ప్రభుత్వ విభాగాలు, వాటి పని విధానంపై పౌరులకు అందించే సేవలు విధానంపై ప్రముఖులతో..ఇంటర్వ్యూలు, శిక్షణలు మీటింగులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. జనవరి 7వ తేదిన హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయీ అవగాహన సదస్సు, శిక్షణకు 1000 మందికి అవకాశం కల్పించ బడుతుందని అన్నారు.
ఇప్పటికే 800 సభ్యత్వం ఉందని మరో 200 మందికి మాత్రమే ఈ శిక్షణలో పాల్గొనే అవకాశం ఉందని అన్నారు. వెంటనే రూ.200ల సభ్యత్వం చెల్లించి సభ్యత్వం తీసుకొని ఒకరోజు శిక్షణకు హాజరు కావాలని అన్నారు. సమాచార హక్కు వికాస సమితి చట్టాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించడం ద్వారా అవినీతి, అక్రమాలను అరికట్టడానికి, దోహద పడుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులు మాత్రమే పొందడానికి, అభివృద్ధి పనుల్లో నాణ్యత పెరగడానికి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడడానికి సమాచార హక్కు చట్టం ఉపయోగించు కోవచ్చని అన్నారు.పౌర సైనికులు సివిల్ సోల్జర్స్ గా పనిచేయవచ్చని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు ప్రతి సమస్య పరిష్కారానికి మార్గం ఉంటుందని ప్రజలకు కావలసిన పనులు చేయుటకు ప్రభుత్వ వ్యవస్థలు,విభాగాలు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నాని వారికి జీతం ఇచ్చేది ప్రజలుగా వున్న మనం హమారా పైసా – హమారా ఇసాబ్ మన పైసలతో చేయు ప్రతి ఖర్చుల లెక్కలు మాకు ప్రజలకు చెప్పాలని అన్నారు.ప్రజలు కట్టే పన్నులతో చేస్తున్న పనులు ఏమిటి? ఆ పనులకు అయ్యే ఖర్చు ఎంత? ప్రజలు అడిగి నప్పుడు ప్రతి పైసాకు లెక్క చూపాలని అన్నారు. చట్టాలపై, హక్కులపై అవగాహన పెంచు కోవడానికి మీకు సరైన అవకాశంవుంటుందని తెలిపారు.

Spread the love