ఇండ్లలో మసాలా దినుసుల్లో వాడే లవంగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవి అందరికీ తెలుసు. వీటిని నాన్‌వెజ్ వంటకాలు లేదా మసాలా కూరలకే కాదు, ఇంకా చాలా రకాలుగా వాడవచ్చు. అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటంటే…
లవంగాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ డామేజ్‌తో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
లవంగంలోని బలమైన జెర్మిసైడల్ లక్షణాలు పంటి నొప్పి, గొంతు, చిగుళ్ళు, పూతల నివారణకు సహాయపడతాయి.
క్రిమినాశక, యాంటీవైరల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు లవంగాలలో సమద్ధిగా ఉంటాయి. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పిని నయం చేయడానికి లవంగాలు సహాయపడతాయి.
లవంగంలో ఉన్న యూజీనాల్ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ బరువు తగ్గడానికి కీలకం. లవంగం సహజంగా జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.
లవంగాలు ఫ్రీ రాడికల్ చర్యతో పోరాడటం ద్వారా, అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి.
లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. మరీ ముఖ్యంగా టీ తయారీలో లవంగాలను ఉపయోగించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
లవంగం టీ తయారీ విధానం :
టేబుల్ స్పూన్ లవంగాలను మెత్తగా చేసుకోవాలి.
ఓ గిన్నెలో, కప్పు నీరు పోసి తరువాత లవంగాల పొడి వేసి మరిగించాలి.
మూడు నుంచి నాలుగు నిమిషాలు పాటు ఆగండి.
కాస్త చల్లబడగానే వడబోసి తాగండి.