అజీర్ణం, ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలు సర్వసాధారణం. నల్ల మిరియాలు కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావాన్ని పెంచి జీర్ణక్రియని పెంపొందిస్తాయి. నల్ల మిరియాలు కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆపానవాయువుని తగ్గిస్తుంది. ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణగా..
వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. నల్ల మిరియాలు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి వివిధ వ్యాధికారకాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఇది సహజ యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలని నివారిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నల్ల మిరియాలతో సూక్ష్మజీవుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
జలుబు, జ్వరం..
వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడతారు. మిరియాలు తీసుకుంటే వీటన్నింటి నుంచి రిలీఫ్ ఉంటుంది. నల్ల మిరియాలను డైట్‌లో చేయడం, గోరువెచ్చని నీటిలో మిరియాల పొడి కలిపి తీసుకుంటే వీటి నుండి రిలాక్సేషన్ ఉంటుంది.
ఇమ్యూనిటీ..
బ్లాక్ పెప్పర్‌లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. వర్షాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. ఇది ఇమ్యూనిటీని పెంచుతాయి. దీంతో ఆరోగ్య సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చు.
కీళ్ళ నొప్పులు..
వర్షాకాలంలో కీళ్ళనొప్పులు, వాపులు వంటి సమస్యలు తగ్గుతాయి. నల్ల మిరియాలని తీసుకుంటే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులోని పైపెరిన్ నొప్పిని తగ్గిస్తుంది. మీ ఆహారంలో నల్ల మిరియాలని చేర్చితే కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.