నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ సొంత గడ్డకు చేరుకున్నా.. తెలుగు టైటాన్స్ రాత మారటం లేదు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెంగళూర్ బుల్స్ చేతిలో తెలుగు టైటాన్స్ 26-42తో ఏకంగా 16 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఈ సీజన్లో తెలుగు టైటా న్స్‌కు ఇది 12వ పరాజయం. మ్యాచ్ ప్రథమార్థంలో మెప్పించిన తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ శెరావత్ జోరుతో మూడు పాయింట్ల ముందంజలో నిలిచింది. కానీ ద్వితీయార్థంలో మూడుసార్లు కుప్పకూలిన టైటా న్స్.. వరుసగా పాయింట్లను కోల్పోయింది. బెంగళూర్ బుల్స్ తరఫున అక్షిత్, సుర్జీత్ సింగ్ రాణించారు. ఇక ప్రొ కబడ్డీ లీగ్ హైదరాబాద్ అంచె పోటీలను సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.