భగీరథ సర్వేను పరిశీలించిన డీఎల్ పీఓ..

నవతెలంగాణ – మాక్లూర్ 
మండల కేంద్రంలో మిషన్ భగీరథ సర్వేను గ్రామపంచాయతీ అధికారులు చేస్తున్న తీరును డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేను సరిగా చేయాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని పంచాయతీ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఎంపిటిసి వెంకటేశ్వర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love