చల్మెడ లో గంగదేవి గుడి నిర్మాణంకు భూమి పూజ..

నవతెలంగాణ- మునుగోడు: మండలంలోని చల్మడ గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న గంగాదేవి గుడి నిర్మాణం కు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రామాలలో కులాలకు అతీతంగా  భక్తి భావం పెరిగినప్పుడు ప్రజలలో స్నేహ భావం పెరుగుతుందని అన్నారు. గ్రామంలో గ్రామదేవతల ఆశీర్వాదంతో గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. గ్రామంలోని ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉండేందుకు శుభ సూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాతరాజు సత్తయ్య, కొంక శంకర్, కొంక చంద్రయ్య, పగిళ్ల శ్రీరాములు, కర్నాటి రామకృష్ణ, యాదవ సంఘం సభ్యులు నెల్లికంటి రాఘవేంద్ర, గుండెబోయిన వెంకటయ్య, నరసింహ, పరమేశ్, యాంపల్ల మహేష్ , గుండెబోయిన సైదులు, నెలికంటి యాదయ్య , బండమీది యాదయ్య తదితరులు ఉన్నారు.
Spread the love