భువనగిరి ఎమ్మెల్యే కుంభంను సన్మానించిన ఎస్సై పెండ్యాల ప్రభాకర్

నవతెలంగాణ -వలిగొండ రూరల్

మండలంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లో నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని సోమవారం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ పెండ్యాల ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ఏఎస్ఐ శ్యాంసుందర్ రెడ్డి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love