మేడారంలో మంత్రి సీతక్కకు బిగ్ షాక్..

– అర్థరాత్రి కలెక్టర్ కు వ్యతిరేకంగా వ్యాపారులు నినాదాలు
– జాతరకు వేసుకున్న దుకాణాలను కూలగొట్టడంపై ఆగ్రహం
నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపార దుకాణాలను శుక్రవారం అర్ధరాత్రి జేసీబీ ల సహాయంతో కూల్చివేసిన అధికారులు. దీంతో చిరువ్యాపారులు అధికారులకు ఎదురుతిరిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో జిల్లా అదనపు కలెక్టర్  కారును అడ్డగించి నిరసన తెలిపారి. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన వైనం. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ, మంత్రి సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొబ్బరి, బెల్లంషాపుల లొల్లి రచ్చకెక్కింది. మహాజాతర సందర్భంగా జాతరలో ఏర్పాటు చేసే ఈ దుకా ణాల పంపకంలో ఆదివాసీ సంఘాలకు, స్థానిక యువకులకు మధ్య అవగాహన కుదరడం లేదు. దీంతో జాతరలో 100 కోళ్ల దుకాణాలు, 20 బెల్లం, 20 కొబ్బరి, 22 లిక్కర్ దుకాణాలు ఏర్పాటు చేయడంలో జాప్యం పెరుగుతోంది. వాస్తవానికి ఈ నెల 7వ తేదీనే ఐటీడీఏ షాపులకు అనుమతులిస్తూ లైసెన్సులు జారీ చేయగా, పంపకాల్లో వచ్చినగొడవతో ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు.
పూజారులు, సంఘాలకే..
మహాజాతర సందర్భంగా భక్తులకు బెల్లం, కొబ్బరి, లిక్కర్, కోళ్ల దుకాణాలను జాతరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమ తులిస్తూ ఐటీడీఏ ద్వారా లైసెన్సులను జారీ చేస్తుంది. నిర్ణీత రసుము చెల్లించి పూజారుల సంఘంతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు షాపులు లైసెన్సులను పొందుతారు. తరు వాత ఫైవ్మెన్ కమిటీ ద్వారా ఎవరెవరికి ఎన్ని దుకాణాలను కేటాయించాలో నిర్ణయిస్తారు. అనంతరం లైసెన్సులు పొందిన వారు జాతర పరిసరాల్లో దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారా లను ప్రారంభిస్తారు. ఇదిలా వుండగా, ప్రతీసారి జరిగే పద్ధతి ప్రకారం జాతరలో ఏర్పాటు చేసే షాపులను పూజారులు, ఆదివాసీ సంఘాలు సమానంగా పంచుకుం టాయి. షాపులను పూజారుల సంఘానికి కొన్ని కేటాయించిన తరువాత  మిగిలిన షాపులను వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు పంచుకునేవారు. దీని ప్రకారం తొలుత 20 కొబ్బరి, 20 బెల్లం దుకాణాలకు సం బంధించి రూ.14,700తో బ్యాంకు ద్వారా డీడీలు తీసి ఏటూరునాగారం గిరిజన సమగ్రాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సమర్పించారు. ఈనెల 7వ తేదీన లైసెన్సులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, 100 కోళ్ల దు కాణాలు, 22 లిక్కర్ దుకాణాలు అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు.
మాకు కూడా కావాలి..
ఈ సారి దుకాణాలు తమకు కూడా కేటాయించాలని మేడారంలోని అభ్యుదయ యువజన సంఘం యువకులు డిమాండ్ చేస్తున్నారు. గత వర్షాకాలంలో జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహించడంతో మేడారం వరద ముంపునకు గురైందని, తాము చాలా నష్టపోయామని చెప్పారు. తమకు న్యాయం జరగాలంటే జాతరలో తాత్కలికంగా ఏర్పాటు చేసే కొబ్బరి,బెల్లం లిక్కర్, కోళ్ల దుకాణాలలో కొన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పూజారులకు కాకుండా, ఆదివాసీ సంఘాలకు కేటాయించే షాపుల్లో కొన్ని తమకు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దుకాణాల పంపి ణీలో గొడవలు ప్రారంభమయ్యాయి. స్థానిక యువకులకు షాపులు కేటా యిస్తే సంఘాలకు తక్కువ వస్తాయని నాయకులు అభ్యంతరాలు తెలుపు తున్నారు. అయితే తమని కాదని జతరలో దుకాణాలను ఎలా నిర్వహి స్తారో చూస్తామంటూ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొలిక్కిరాని గొడవ
మేడారం జాతరలో  దుకాణాల పంపిణీల కోసం పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు, స్థానిక యువత పలు సార్లు సమావేశం అయ్యారు. తమకు షాపులు తప్పకుండా కేటాయించా లని స్థానిక అభ్యుదయ యువజన సంఘం సభ్యులు పట్టుపడుతుండ డంతో కొబ్బరి, బెల్లం దుకాణాల కేటాయింపు కొలిక్కిరాలేదు.
Spread the love